శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్‌

04 ఆగస్టు, 2026

Vinayaka Chavithi is approaching... CP issues warning to Ganesh idol makers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ ‌: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హెచ్‌-ఫాస్ట్‌ అధికారులు తనిఖీలు చేపట్టి 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌ తెలిపారు. మంగళవారం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ .... 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించి, 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 క్రిమినల్‌ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. మసాలాల్లో సింథటిక్‌ రంగులు, క్లాత్‌ డైలు, టాల్కమ్‌ పౌడర్లు, ఇండస్ట్రియల్‌ కలర్స్‌, రైస్‌ బ్రాన్‌ అయిల్‌ వాడినట్లు గుర్తించామన్నారు. కల్తీ మసాలాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్