శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్షాల వేళ .. ఐటి ఉద్యోగులు 4 గంటల్లోపే ఇండ్లకు వెళ్లాలి..!

2 రోజుల క్రితం

During the rainy season IT employees should head home by 4 PM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో .... సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఐటి సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.


ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ... గురువారం వరకు ఐటి కంపెనీలు దశలవారీగా ముందస్తు లాగ్ ‌ఔట్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఉద్యోగులను విడతలవారీగా ఇళ్లకు పంపించాలని, సాయంత్రం 4 గంటలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. కార్యాలయాల నుంచి ఉద్యోగులంతా ఒకేసారి బయటకు వస్తే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వర్షాల ప్రభావం దృష్ట్యా రానున్న మూడు రోజుల పాటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాలని ఐటి సంస్థలకు సూచించారు. ముందస్తు లాగ్‌ఔట్‌ అమలు చేసే సమయాలు, సంస్థల చిరునామా వివరాలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు cybtrcc@gmail.com ఈ–మెయిల్‌ ద్వారా పంపించాలని కోరారు. సంస్థల నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్