శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థిని మృతదేహంతో కుటుంబీకుల ఆందోళన

1 రోజు క్రితం

Family members protest with the body of a female student
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : వరంగల్‌ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడటంతో ... ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టిన ఘటన బుధవారం జరిగింది. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ పరిధి బుచ్చినాయక్‌తండాకు చెందిన వాంకుడోతు కమలమ్మ, సమ్మయ్య దంపతుల కుమార్తె వైష్ణవి (20) మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్ ట్రిపుల్‌ ఐటీడీఎంలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 2 న కళాశాలలోని హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి మృతికి చెన్నారావుపేటకు చెందిన బోడ సుమన్ కారణమంటూ ... బాధితురాలి బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం పేరిట వైష్ణవిని మోసం చేశాడంటూ వాపోయారు. తన కూతురు ఆత్మహత్యకు బోడ సుమన్ అనే యువకుడే కారణమంటూ ఆమె తండ్రి సమ్మయ్య అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు వెళుతుండగా, చెన్నారావుపేటలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ఆందోళన చేశారు. నెక్కొండ సీఐ ఫణీందర్, ఎస్సైలు శ్రావణ్‌ కుమార్, గోవర్ధన్‌ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి సముదాయించి పంపించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్