శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయాణికురాలి దాడి ఘటన - చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

2 రోజుల క్రితం

Incident involving an attack by a female passenger Conductor dies while undergoing treatment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గతనెల 25 న చిల్లర విషయంలో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళిక చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. గాయాలపాలైన ఆమెను హైదరాబాద్‌లోని కొత్తపేట సాయి సంజీవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రవళిక మృతిపై ఆర్టీసీ కార్మికులు, యూనియన్‌ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అవసరమైన సహకారం అందించాలని డిమాండ్‌ చేశారు.


కండక్టర్ ప్రవళిక మరణం ఆర్టీసీకి తీరని లోటు.. కుటుంబానికి అండగా ఉంటాం : ఆర్టీసీ ఎండీ

ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మణుగూరు డిపో మహిళా కండక్టర్‌ ప్రవళిక మరణం టీజీఎస్‌ ఆర్టీసీకి తీరని లోటని సంస్థ వీసీ అండ్‌ ఎండీ వై. నాగిరెడ్డి అన్నారు. ఆమె మృతి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక ఆరోగ్యం మెరుగుపడి తిరిగి విధుల్లోకి వస్తారని ఆశించామని, కానీ ఇంతలోనే మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగడం దురదృష్టకరమని నాగిరెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రవళిక మరణవార్త తెలియగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. సంస్థ తరఫున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్