తెలంగాణ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం (అక్టోబర్ 4) తెలంగాణలో ఒక రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మంత్రి చేరుకుని లోక్‌భవన్‌లో బస చేస్తారని అధికార వర్గాల సమాచారం.
షెడ్యూల్ ప్రకారం ... అమిత్ షా ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లాలోని తూప్రాన్‌కు వెళతారు. అక్కడి ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేయనున్న సాబర్ డెయిరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్లాంట్‌కు సంబంధించిన పనులను ప్రారంభిస్తారు. తూప్రాన్‌లో కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా కరీంనగర్‌కు బయలుదేరి వెళతారు.
కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకల్లో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరించడంతోపాటు, ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కళాశాల ప్రస్థానాన్ని తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ప్రతిమ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం కరీంనగర్‌లో కార్యక్రమాలు ముగించుకుని, హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. గతేడాది సెప్టెంబర్ 2025లో ఎంజే మార్కెట్ వద్ద జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపులో పాల్గొనేందుకు అమిత్ షా చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన సంగతి విదితమే.








కామెంట్‌లు (0)