శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కండక్టర్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి పొన్నం ప్రభాకర్

2 రోజుల క్రితం

Rs10 lakh exgratia for conductors family Minister Ponnam Prabhakar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 02:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ప్రయాణికురాలు నెట్టివేయడంతో ఆర్టీసీ బస్సు కిందపడి తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్‌ గుండ్ల ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిని పరామర్శించి కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి ఆదేశాల మేరకు ... బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకు తరపు నుంచి మరో రూ. కోటి వరకు ప్రమాద బీమా అందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ .... మహిళా కండక్టర్ ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ' ఆర్టీసీ సిబ్బంది పొరపాటు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి.. అంతే తప్ప చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు ` అని హెచ్చరించారు. ఓ ప్రయాణికురాలు తోసెయ్యడం వల్ల.. మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెంది ఓ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారంత పాటు ఒక ఇందిరమ్మ ఇల్లు, ఆమె తల్లికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్