Oct 13,2021 21:12

ఆహస్‌(డెన్మార్క్‌): భారత పురుషుల బ్యాడ్మింటన్‌ బృందం థామస్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి జరిగిన పోటీలో భారత్‌ 5-0 తేడాతో తహితి జట్టును చిత్తుచేసింది. దీంతో భారత్‌ గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 5-0 తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. ఇక భారత్‌ ఈ గ్రూప్‌లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో గురువారం తలపడనుంది. తొలి సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ 21-5, 21-6తో లూసీ బ్యూబస్‌ను, రెండో సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 21-12, 21-12తో రేమీ రోసీని చిత్తుచేయగా.. మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో 21ఏళ్ల కిరణ్‌ జార్జి 21-4, 21-2తో కేవలం 15నివిషాల్లోనే ముబ్లాన్స్‌ను ఓడించాడు. పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్ధన్‌ 21-8, 21-7తో కేవలం 21వ మిషాల్లోనే గ్లెన్‌ లీఫోల్‌-రెమ్మీ రోసీలను ఓడించారు.