Jun 23,2021 16:21

నంద్యాల (కర్నూలు) : శిశు సంక్షేమ శాఖ అధికారి లీలావతి దేవి ఆధ్యర్యంలో పొన్నాపురం కాలని ఐసీడీఎస్‌ భవనం నందు నంద్యాల మండలం, బండి ఆత్మకూరు మండలం, పాణ్యం మండలం అంగనవాడి కార్యకర్తలకు, మహిళ పోలీసులకు ఏర్పాటుచేసిన మూడవ దశ కోవిడ్‌ ప్రిపేర్‌డినేష్‌ శిక్షణా కార్యక్రమంలో చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పామన ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పామన మాట్లాడుతూ.. మూడవ విడత కరోనాపై అవగాహన కల్పిస్తూ 3వ విడతలో కరోనా పిల్లలపైన ప్రభావం చూపిస్తుంది అని డబ్ల్యుహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ నిపుణులు హెచ్చరిస్తున్న సందర్భములో అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లుల పేర్లను నమోదు చేసుకోవాలని, తల్లులకు కోవిడ్‌ సరిఅయిన ప్రవర్తన గురించి, ముఖ్యంగా ఐదు సంవత్సరాలు పిల్లలు కలిగిన తల్లులకు, 45 సంత్సరాలు వయసు కలిగిన వారికీ తప్పక కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలి అని, టీకా వేయించుకోవడం వలన తల్లి నుంచి బిడ్డకు అంటిబడిస్‌ ఏర్పడి కోవిడ్‌ వైరస్‌ను తట్టుకొనే శక్తి ఏర్పడుతుంది అని చెప్పారు. ముఖ్యంగా బలహీనంగా ఉండే పిల్లలు కరోనాకు గురిఅయ్యే అవకాశం ఉంది కాబట్టి, దగ్గు, జలుబు, జ్వరం, వొళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, విరోచనాలు లక్షణాలు ఉంటే ఆర్‌టిపిసిఆర్‌, రాపిడ్‌ అంటిజెన్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ విజయ పాల్గొన్నారు.