
అగర్తల : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 20 మంది అభ్యర్థుల జాబితాను త్రిపుర ఇండిజీనియస్ ప్రొగ్రేసివ్ రీజినల్ అలయన్స్ (టిఐపిఆర్‌ఎాటిప్రా మోతా) విడుదల చేసింది. పట్టు ఉన్న ప్రాంతానికి వెలుపుల 8 స్థానాలకు కూడా టిప్రా అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. త్రిపుర రాజవంశీయుడైన ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవవర్మ టిప్రా మోతాకు నాయకత్వం వహిస్తును సంగతి విదితమే. తనతో పాటు రాజవంశీయులెవ్వరూ ఎనిుకల్లో పోటీ చేయబోరని జాబితా విడుదల సందర్భంగా శనివారం రాత్రి ప్రద్యోత్ వెల్లడించారు. బిజెపికి సన్నిహితంగా ఉండే ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి), టిప్రా ఎన్నికల ముందస్తుగానే పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు. దీంతో టిప్రా ఒంటరిగానే బరిలో దిగుతుందని ప్రద్యోత్ ప్రకటించి జాబితా విడుదల చేశారు.