Sep 18,2023 13:32

ప్రజాశక్తి-విజయవాడ : జాషువా సాంస్కృతిక వేదిక, అమరావతి బుద్ధ విహార, జి.ఆర్.కె-పోలవరపు కళాసమితి సంయుక్త ఆధ్వర్యంలో  'సనాతన ధర్మమా ... సమతా మార్గమా' అను అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విశ్రాంత జియోలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు ముఖ్య వక్తగా జరిగే ఈ సదస్సు ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5:30గం.లకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దేవరాజు మహారాజు రచించిన సప్తతి, జన్యులిపి పుస్తకాలను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఇఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మానవతావాది డాక్టర్ జి సమరం  ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు తెలిపారు.