Jul 26,2021 15:32

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టోక్యో ఒలింపిక్స్‌లో ఓ అథ్లెట్‌.. తన వేషధారణతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఏంటా వేషధారణ అనుకుంటున్నారా..? ఒంటికి మ్యాట్‌ చుట్టుకొని, చొక్కా లేకుండా... దూరం నుంచి చూస్తే.. చెమట పట్టిందేమోనన్నంతగా.. చర్మానికి ఆయిల్‌ పూసుకుని... టోంగాన్‌ జెండాను మోస్తూ దర్శనమిచ్చాడు. అది కూడా ఒక్కసారి కాదు.. వరుసగా ఇది నాలుగోసారి. ఒకరకంగా చెప్పాలంటే.. ఈసారి కూడా ఇతను కనిపించనున్నాడా లేదా అనే సందేహాలు తలెత్తిన సమయంలో ఊహించినట్టుగానే ఆయన వింత ప్రదర్శనతో అందరికీ కనువిందు చేశారు. ఇలా మళ్లీ ఒలింపిక్స్‌లో కనిపించడంపై.. ఒలింపిక్స్‌ నిర్వహణా బృందం కూడా హర్షం వ్యక్తం చేసింది. అంతకుముందు ఆయన 2016, 2018, 2020లో పాల్గొన్న చిత్రాలను ఒలింపిక్స్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసి.. 'ఇతని వేషధారణ అథ్లెటిక్స్‌కి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా ఉంది' అని పోస్ట్‌ చేసింది. ఇంత సెలబ్రిటీగా మారిపోయిన ఆ అథ్లెట్‌ ఎవరు, ఎక్కడివారు అన్న వివరాల్లోకి వెళితే... ఇతను ఆస్ట్రేలియాకు చెందిన తౌఫాటోపువా. తోంగా జాతికి చెందినవారు. ఇతను 2020లో 80 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించారు.

tongon


ఇతను మొదటిసారి పాపువా న్యూ గినియాలోని పోర్ట్‌్‌ మోరేస్బీలో 2016 ఫిబ్రవరిలో జరిగిన ఓషియానియా టైక్వాండో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ వరకు వచ్చారు. అతను తొలిసారి ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొన్నా... ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి ముందు టోంగాన్‌ జెండాను మోశాడు. ముఖ్యంగా టోంగాన్‌ నుండి వచ్చిన మొదటి అథ్లెట్‌ ఇతనే కావడం విశేషం. అలాగే ఇతను 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో.. అంటే గడ్డకట్టే చలి కంటే తక్కుగా ఉన్నప్పటికీ.. అతను చొక్కా లేకుండా.. టెంగాన్‌ జెండాను పట్టుకొని.. పరేడ్‌ చేస్తారని మీడియాకు చెప్పడంతో.. అప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మీడియాకు తెలిపినట్లే.. అతను మరోసారి టోంగా జాతి సాంప్రదాయ వేషధారణతోనే పరేడ్‌ చేశారు. ఇక 2020లో కూడా అదేవిధంగా పరేడ్‌ చేశారు. ఇప్పుడు తాజాగా 2021లో కూడా అదేవిధంగా చొక్కాలేకుండా.. మ్యాట్‌ చుట్టుకొని టెంగాన్‌జెండాను మోస్తూ పరేడ్‌ చేసి.. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈసారి అతను మెడలో కోవిడ్‌ మహమ్మారి వల్ల చనిపోయిన అతని కుటుంబ సభ్యులకు నివాళిగా ఓ ముత్యాల హారాన్ని కూడా ధరించారు.
ఇక వ్యక్తిగత విషయాలకొస్తే.... తౌఫాటోపువా ఆరుగురు తోబుట్టువులతో.. తల్లిదండ్రులతో అతి చిన్న గదిలో నివాసమున్నారు. పేదరికాన్ని చవిచూశారు. అథ్లెట్‌ కాకముందు... 18 ఏళ్ల వయసులో మోడల్‌గా కూడా పనిచేశారు. అతను ఇంజనీరింగ్‌ చదవడమే కాకుండా.... 2016లో మాస్టర్స్‌ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఈయన యునిసెఫ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే చిన్నారులకు వారి కాళ్లపై వారు స్వతంత్రంగా బతికేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించేలా.... స్వచ్చంద సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నారు. మరి ఇంత చదువు చదువుకొని.. ఇలా అథ్లెటిక్‌గా ఎందుకు మారారనే ప్రశ్నకు ఆయన స్పందింస్తూ.. 'ప్రపంచవ్యాప్తంగా మా జాతి గురించి చెప్పుకునేవిధంగా.. గర్వించేవిధంగా చేయాలనే నేను ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను. పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రాదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆ వస్త్రధారణతో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను' అని ఆయన అన్నారు. గతంలో ఇతనికి శరీరంలో ఆరు ఎముకలు విరిగి.. మూడు నెలలు వీల్‌ చైర్‌కే పరిమితమయ్యాడు. ఫిజియోథెరపీ చికిత్స చేయించుకుని... ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు.

tongon 3