Jul 27,2021 06:51

టోక్యో : జపాన్‌కు చెందిన 13ఏళ్ల మొమిజి నిషియా చరిత్ర సృష్టించింది. మహిళల స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌ విభాగంలో 15.26పాయింట్లతో స్వర్ణ పతకం సాధించి.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన రెండో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది. నిషియా వయసు 13ఏళ్ల 330 రోజులు. ఒలింపిక్స్‌ ఈ క్రీడాంశాన్ని తొలిసారి ప్రవేశపెట్టగా.. కేవలం ఆరు దేశాలు మాత్రమే ఇందులో ప్రాతినిధ్యం వహించాయి. ఈ ఈవెంట్‌లో బ్రెజిల్‌కు చెందిన రైసా లీల్‌(14.64పాయింట్లు) రజితం కైవసం చేసుకుంది. ఆమె వయసు కూడా 13ఏళ్లే కావడం విశేషం. ఇక కాంస్య పతకాన్ని జపాన్‌కే చెందిన 16ఏళ్ల ఫునా నకయామా (14.49పాయింట్లు) సొంతం చేసుకుంది. ఇక 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో స్ప్రింగ్‌ బోర్డ్‌ టైటిల్‌ను సాధించిన మార్జోరీ గెస్టింగ్‌ వయసు 13ఏళ్ల 268 రోజులు మాత్రమే.