Oct 01,2022 18:29

వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరో ఆది సాయికుమార్‌ 'టాప్‌ గేర్‌' అనే విభిన్న కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో కెవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భిన్న కోణాన్ని టచ్‌ చేస్తున్నామని, ఇందులో ఆది చేసే యాక్షన్‌ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో ఆది టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. మూవీ ప్రమోషన్లు భిన్నంగా చేయాలని తొలిసారి త్రీడీ వెర్షన్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినట్లు నిర్మాత తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌, హేమంత్‌, బెనర్జీ, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్నారు.