Oct 05,2022 12:25

ప్రజాశక్తి-పలాస : పలాస మండలం తర్లాకోట కాటమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కాటమ్మ తల్లి ఆలయం వద్ద లొద్దభద్ర, తర్ల కోట, మొగిలిపాడు, పలాస, అల్లు కోల, సవర గోవిందపురం, మహాదేవుపురం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వాహనాలను పూజ చేసేందుకు రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోవడంతో వాహన చోదకులు, ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.