Sep 18,2023 17:43

ప్రజాశక్తి-జి సిగడాం : శ్రీకాకుళం జిల్లా బాతువ సుద్ద గడ్డ వద్ద ఓహెచ్ వైర్లు తెగిపోవడంతో  పలాస విశాఖ ఈఎంయు రైలు నిలిచిపోయింది.  ఓహెచ్ వైర్లు బ్రేక్ డౌన్ కావడంతో  3:15 నిమిషాలకు రైల్వే ట్రాక్ పైన ఈఎంయు రైలు నిలిచిపోవడంతో దాని వెనుక నుంచి వచ్చే కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ రైలును దారిని మళ్ళించారు. తెగిన వైరులును మరమ్మతు చేసి రైలు పంపించేందుకు ఆలస్యం అవుతుందని సమాచారం. వైర్లు మరమ్మత్తులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.