
అగర్తలా : సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలోని వామపక్ష ప్రతినిధి బృందం గురువారం త్రిపుర గవర్నర్ను సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలుసుకుంది. ఉప ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార బిజెపి పాల్పడుతున్న హింసాకాండపై మెమొరాండం సమర్పించింది. అంతకుముందు త్రిపుర డిజిపిని కూడా బృందం కలుసుకుని, వినతిపత్రం సమర్పించింది. ఈ హింసాకాండకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.