Aug 19,2022 13:34

చెన్నై : ప్రముఖ హీరోయిన్‌ త్రిష ఇప్పుడు మరో రంగంలోకి అడుగుబెట్టబోతున్నారట. అటు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రతారగా ఎదిగిన త్రిష.. ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే తమిళనాడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజరు దళపతి సూచనల మేరకు ఆమె రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని టాక్‌. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని అక్కడి సీనియర్‌ జర్నలిస్టు వెల్లడించారు. ఆమె దృష్టి కాంగ్రెస్‌పైనే ఉందని అన్నారు. మరో అగ్ర నటి ఖుష్బు.. కాంగ్రెస్‌ నుండి బిజెపిలోకి చేరడం కూడా పార్టీకి కలిసొచ్చే అంశమన్నారు. ప్రస్తుతం త్రిష.. మణిరత్నం తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ పొన్నియన్‌ సెల్వన్‌ : 1 లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 30న ధియేటర్లలో సందడి చేయనుంది.