Sep 22,2022 11:35
  • గిరిజనుల కష్టాలు తీరేదేన్నడో

ప్రజాశక్తి-దేవరపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు వీలబద్రపేట గ్రామంలో వారం రోజులు వ్యవధిలో రోడ్డు సౌకర్యం లేక, మెరుగైన వైద్యం అందక ఇద్దరు చిన్నారులు మృతి చెందారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న తెలిపారు. చిన్నారులు  గమ్మేల ప్రవీణ్, సూకురి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈరోజు మరో చిన్నారి గమ్మేలకావ్యకి ఆరోగ్యం బాగలేకపోవడంతో 108 వాహనానికి ఫోన్ చేయగా, గ్రామంలోకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాదాపుగా కిలోమీటారు దూరం చేతులు మీదుగా మోసుకోచ్చారు. కాశీపురం రోడ్డు రీపేంగుకు రోడ్డుపై అడ్డంగా రాళ్ళు కుప్పలు వేయడంతో వీరభద్రం పేట జంక్షన్ నుండి సీతం పేట వరకు ఐదు కిలోమీటార్లు దూరం బైక్ పై తీసుకువచ్చి 108 వాహనానికి ఎక్కించారని తెలిపారు. ఇన్ని కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి, అధికారులకు కనీసం పట్టడం లేదన్నారు. 75 ఏళ్ళు స్వాతంత్రరం పండగ చేసుకున్న ప్రభుత్వానికి గిలిజనులకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం దారుణమన్నారు. అసెంబ్లీలో రెండు రోజులు విద్యా, వైద్యం, రోడ్లు నాడు-నేడు పనులపై నామమాత్రపు చర్చలు జరిపిన ప్రభుత్వానికి గిరిజనులు ప్రాణాలు పట్ల లెక్కలేదన్నారు. డిప్యూటీ సిఎం సోంత మండలంలోని డోలిమోతలు, మరణమృదంగాలు తప్పడం లేదన్నారు.  జంతువుల ప్రాణాలకు ఉన్న విలువ కూడా గిరిజనులు ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. రెండు రోజులు క్రితం శంకరం పంచాయతీలో కొత్తవలసలో చివేరి కొండలరావుకు వైద్యం అందక చనిపోయారని తెలిపారు. ఈ ప్రభుత్వ స్పందింకపోతే దీని పర్యావసాణం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వెంటనే వీలబద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, చిన్నారుల మృతికి కారణాలను గుర్తించి, మెరుగైన వైద్యం అందించాలని వెంకన్న డిమాండ్ చేసారు.