
న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు 'అసంబద్ధమైన రీతిలో ఉచితాలు' ఇస్తామని వాగ్దానం చేసే రాజకీయ పార్టీల చిహ్నాలను రద్దు చేయాలని లేదా పార్టీలనే రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఓటర్ల నుండి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు గానూ చేపట్టే ఇటువంటి ప్రజాకర్షక చర్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నందున వాటిపై పూర్తిగా నిషేధం వుండాలని ఆ పిటిషన్ కోరింది. ఎన్నికల కమిషన్ వెంటనే తగు చర్యలు చేపట్టాలని కోరింది. ఇలా చేయడం వల్ల ఎన్నికల క్రమం స్వచ్ఛత దెబ్బతింటోందని ఆ పిటిషన్ పేర్కొంది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ను దాఖలుచేశారు. ఇందుకు సంబంధించి ఒక చట్టం చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా కోరారు.