
బెంగళూరు : కరోనా కారణంగా గడిచిన ఏడాదిలో వ్యాపారాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ దేశంలో అతిపెద్ద బి2బి ఇ -కామర్స్ వేదిక ఉడాన్ మాత్రం 250 మంది లైఫ్‌స్టైల్ విక్రేతలు దాదాపు రూ.1 కోటీ పైగా విలువైన అమ్మకాలను చేశారని ఆ సంస్థ తెలిపింది. 2020లో లైఫ్‌స్టైల్ విభాగంలో వస్త్రాలు, యాక్ససరీలు, ఫుట్‌వేర్ వంటివి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. దేశంలోని మొత్తం లైఫ్‌స్టైల్ రిటైలర్లలో 20 శాతం మందికి 23 కోట్ల ఉత్పత్తులను వీరు సరఫరా చేశారని పేర్కొంది. ఒక్క కోటి కంఫర్ట్ వేర్ ఉత్పత్తులు, మరో కోటి స్లిప్పర్లు, 90 లక్షల టీ షర్టులు, 40 లక్షల షర్ట్‌లను దేశవ్యాప్తంగా విక్రయించారని వెల్లడించింది. మహమ్మారి తొలి 8 నెలల్లోనే 2.5 కోట్ల మాస్కులను ఉడాన్‌పై విక్రయించారని పేర్కొంది.