Mar 19,2023 22:50

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గేయానంద్‌

ప్రజాశక్తి -పెనుకొండ : ఉద్యమాలతోనే విద్యారంగసమస్యలకు పరిష్కారం లభిస్తుందనియు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప, ్‌ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు. యుటిఎఫ్‌జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రవీంద్ర భారతి స్కూల్‌ ఆవరణంలో జిల్లా ప్రథమ కౌన్సిల్‌ సమావేశం జిల్లా అధ్యక్షులు జయచంద్రా రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు శాస్త్రీయ దృక్పథంతో పాటు ప్రజా జీవనం, లౌకిక దష్టి, ప్రజా ప్రయోజనాల దష్ట్యా ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యం తీసుకొని వచ్చి ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావాలన్నారు. 3,4,5 తరగతుల విలీనం వలన విద్యారంగం సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వం విద్యా రంగం పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉపాధ్యాయులను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప ఎన్నికల అధికారిగా వ్యవహారించారు. జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఎస్‌.జయచంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె . నాగేంద్ర, గౌరవాధ్యక్షులు కె. బూతన్న, సహాధ్యక్షులుగా జి హెచ్‌ బాబు, పిఎన్‌. సీతాలక్ష్మి, కోశాధికారిగా ఎం.సుధాకర్‌, జిల్లా కార్యదర్శులుగా సి.తహీర్‌ వలి, నారాయణ స్వామి, రమీజాబి, డి శ్రీనివాసులు, సి హరికృష్ణ, కె. చంద్ర శేఖర నాయుడు, రాష్ట్ర కౌన్సిలర్లుగా మారుతీ శ్రీనివాసులు,జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ పి .రామకృష్ణ, సిపిఎస్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌గా నరేష్‌, మునిసిపల్‌ కమిటీ కన్వీనర్‌ గా రామాంజినేయులు,మహిళా కమిటీ కన్వీనర్‌గా సీతాలక్ష్మి, స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌గా మారుతీ శ్రీనివాసులు,.ఐక్య ఉపాధ్యాయ పత్రికా కమిటీ కన్వీనర్‌ గా ఎం.సుధాకర్‌ను ఎన్నుకున్నారు. అదే విధంగా అకాడమిక్‌ కమిటీ కన్వీనర్‌గా కె . శివ శంకర్‌, సాంస్కృతిక కమిటీ కన్వీనర్‌గా మహంతేశ్వర, ఆడిట్‌ సభ్యులుగా ఎం. ఆంజనేయులు, ఎన్‌.జయంద్ర, ఆర్‌ రామకృష్ణ నాయక్‌, ఎం . ఆదినారాయణ, టి. మల్లిఖార్జున, జి.రవీంద్ర తదితరులను ఎన్నుకున్నారు.
జిల్లా కమిటీలో 'పురం' వాసులకు ప్రాధాన్యత
హిందూపురం: పెనుకొండ పట్టణంలోని రవీంద్రభారతి పాఠశాల ఆవరణంలో ఆదివారం జరిగిన యూటిఎఫ్‌ జిల్లా ఎన్నికల్లో హిందూపురం ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ మారుతీ శ్రీనివాస్‌ తెలిపారు. తనతో పాటు జిల్లా సహాధ్యక్షులుగా జిహెచ్‌ బాబు, పిఎన్‌ సీతాలక్ష్మి, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎం రామకృష్ణను ఎంపిక చేశారన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎంపికైన నాయకులు మాట్లాడుతు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటాం చేస్తామన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ధర్మవరం టౌన్‌ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని యుటిఎఫ్‌ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుకొండలోని రవీంద్రభారతి పాఠశాలలో ఆదివారం జరిగిన ప్రథమ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో తనను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారన్నారు. జయచంద్రారెడ్డి ఎంపిక పట్ల ధర్మవరం జోన్‌ నాయకులు రామకృష్ణనాయక్‌, లక్ష్మయ్య, హరికృష్ణ, బిల్లేరామాంజినేయులు, రాంప్రసాద్‌, గోపాల్‌రెడ్డి, మల్లేశ్‌, వినరుకుమార్‌, ఆదిరెడ్డి, అమరనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, అమర్నాథెడ్డి, వేణుగోపాల్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.