
ప్రజాశక్తి- సీలేరు : ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన సీలేరు కాంప్లెక్స్ జెన్కో ముఖ్య ఇంజనీరు వి. రాంబాబుకు స్థానిక ఏపీ జెన్కో గెస్ట్ హౌస్‌లో ఆదివారం సత్కరించి, ఘనవీడ్కోలు పలికారు. హైడల్ పవర్ కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీరు సుజరుకుమార్, సీలేరు కాంప్లెక్స్ ఎస్ఇ సివిల్ కేకేవీ. ప్రశాంత్‌కుమార్, ఇఇలు లక్ష్మీనారాయణ జాకిర్ హుస్సేన్ బాబురావు బాలకష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని, రిటైర్డు సిఇ రాంబాబుకు దుశ్శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలను అందించారు. జల విద్యుత్ కేంద్రంలో ఎలక్ట్రికల్ మెకానికల్ ఇండోర్ ఇంజనీర్లు శ్రీనివాస్ క్రాంతి రమేష్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రోపవర్ కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ సుజరుకుమార్ మాట్లాడుతూ సిఇ రాంబాబు నిబద్ధత అంకితభావంతో విధులు నిర్వహించారని కొనియాడారు. సీలేరు కాంప్లెక్స్‌లో ఏడాది పాటు చక్కగా విధులు నిర్వర్తించి, ఎపి జెన్కోకు లాభాలు చేకూర్చారన్నారు. కాంప్లెక్స్ పరిధిలోని మోతుగూడెం డొంకరాయి సీలేరు మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహిస్తూ, విద్యుదుత్పత్తికి ఎటువంటి అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకరెండేళ్లు రాంబాబు సర్వీసును పొడిగిస్తే ఆయన కింద పనిచేయడానికి పలువురు ఇంజనీర్లు కార్మికులు సుముఖత వ్యక్తం చేయడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు. ఎఇ రమేష్ అప్పలనాయుడు మాట్లాడుతూ చీఫ్ ఇంజనీర్ రాంబాబు ద్వారా ఎన్నో నేర్చుకున్నామని, ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని నిరంతరం శ్రమించి పని చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎడిఇ అప్పలనాయుడు సుధీర్, ఎఇలు సురేష్, పవన్, సబ్ ఇంజనీర్ శిరోమణి పాల్గొన్నారు.