Oct 14,2021 17:32

uttarvulu estunna sp

ఉద్యోగోన్నతులు బాధ్యత పెంచుతాయి : జిల్లా ఎస్‌పి
ప్రజాశక్తి-కలక్టరేట్‌
జిల్లాలో ఆర్మిడ్‌ రిజర్వ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 1990 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లకు, ఎ ఆర్‌ ఎస్‌ ఐ లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఏలూరు రేంజ్‌ డిఐజి కె.వి.మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి పొందిన ఎఆర్‌ఎస్‌ఐలకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం పత్రాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కౌశల్‌ మాట్లాడుతూ ఉద్యోగోన్నతి పొందిన ఉద్యోగులు ఇకపై మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో ఎం డి ఫరూక్‌, ఎం డి షా నజీర్‌,కె.శ్రీనివాసరావు, జి.వి.కె.ఎస్‌. రావు,అబ్దుల్‌ రహీంలు ఉన్నారు.