Jun 01,2023 23:31

ప్రజాశక్తి-రామచంద్రపురం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, అవుట్సోర్సింగ్‌, పెన్షనర్ల కు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సిపిఎస్‌ రద్దు చేస్తూ పెన్షన్‌ సౌకర్యం కల్పిం చాలని తదితర 26 డిమాండ్లతో కూడిన సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు వైద్యులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మున్సిపల్‌ కార్యాల యం ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పి.సుబ్బా రాయుడు, ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఆదిలక్ష్మి, జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఎం.బాపూజీ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేయాలని, ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాలూకా యూనిట్‌ అధ్యక్షులు వైఎస్‌ఆర్‌ మూర్తి, అసోసియేట్‌ అధ్యక్షులు ఏరియా ఆస్పత్రి వైద్యులు ప్రవీణ్‌, కార్యదర్శి ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు కమల్‌ భగవాన్‌, కోశాధికారి సత్యనారాయణ, సంఘీభావంగా మండపేట తాలూకా యూనిట్‌ అధ్యక్షుడు పి.సురేష్‌, అమలాపురం తాలూకా అధ్యక్షులు ఎం.మధు, విఆర్‌ఒల సంఘం నాయ కులు పి.విష్ణుమూర్తి, సురేష్‌, సత్యవతి, కె.గంగవరం నాయకులు బెరద పట్టాభి, కొమ్ము వెంకటేశ్వర్లు, పెన్షనర్ల సంఘం నాయకులు కామేశ్వరరావు, గొల్లపల్లి కష్ణ, ట్రెజరీ నాయకులు బషీర్‌, పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు అన్నవరం, సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు ఉమా శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.