
చెన్నై : బిజెపి ఓ విషసర్పం అని డిఎంకె నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి విమర్శించారు. తమిళనాడులోని నైవేలీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష అన్నాడిఎంకె పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని తెలిపారు. ''విష సర్పం మీ ఇంట్లోకి వస్తే.. దానిని తీసి బయట పడేస్తే కుదరదు. అది మీ ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుంది. ఆ చెత్తను తీసేసే వరకూ అది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఈ సన్నివేశంతో ప్రస్తుత పరిస్థితి పోలిస్తే.. తమిళనాడు మన ఇల్లు. బిజెపి ఓ విష సర్పం. అన్నాడిఎంకె మన ఇంటి వద్ద ఉన్న చెత్తలాంటిది. మనం చెత్తను తీసే వరకు విష సర్పం దూరం కాదు. బిజెపి నుంచి విముక్తి పొందాలంటే.. అన్నాడిఎంకెను తొలగించాలి'' అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.