Feb 23,2021 07:00

నడు...నడూ
నడు...నడూ
ఒక్కటై ... ఉప్పెనై
ఉప్పెనంత ...ఉద్యమమై
ఉద్యమ శక్తై ...రగులుతూ
రగులుతూ..రగిలిస్తూ
కదలుతూ...కదిలిస్తూ
నడు..నడూ!
నడు...నడూ!!
ఉక్కు మనది... హక్కు మనది
భూమి మనది ... బతుకు మనది
శక్తి మనది... యుక్తి మనది
శ్రమ మనది...సంపద మనదే...
నడు...నడూ!!
కొవ్వొత్తుల సెంటర్‌ కాడ
అమరులను తలుచుకుని
కన్నీళ్లు పెడదాం...
కోటి దీపాలవుదాం
మెయిను గేటు కాడ
మన సత్తా చూపుదాం
మహోగ్ర ఉద్యమ జ్వాలై
మహా సమరం చేద్దాం
నడు..నడూ!!
బీచ్‌రోడ్డులోనా
మరో సముద్రమౌదాం
జగదాంబకు చేరి
పోరుజెండా లెగరేద్దాం
విశాఖ నగరమంతా..
ఉవ్వెత్తున లేచి
రణనాదం చేద్దాం...
జననాదం వినిపిద్దాం!!
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు
అమరుల ఆశయాలను సాధిస్తాం.
                                 * పెన్నార్‌, సెల్‌ : 73821 68168