Jan 14,2022 16:46

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ ప్రభుత్వ వెబ్‌ సైట్లపై సైబర్‌ కేటుగాళ్లు దాడి చేశారు. డజన్ల కొద్ది వెబ్‌ సైట్లను టార్గెట్‌ చేసి , ఎంబసీలను కూడా హ్యాక్‌ చేశారు. ఈ సైబర్‌ దాడికి ముందు... చాలా దారుణం జరగునున్నట్లు ఓ వార్నింగ్‌ మెసేజ్‌ వచ్చింది. గడిచిన 9 నెలల్లో సుమారు 1200 సైబర్‌ దాడులను నిర్వీర్యం చేసినట్లు ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ పేర్కొంది. అయితే ఈ దాడులు ఎవరు చేశారన్నది తెలియలేదు. ఉక్రెయిన్‌ ప్రజలారా.. మీ పర్సనల్‌ డేటా మొత్తం పబ్లిక్‌ గా అప్‌ లోడ్‌ చేసినట్లు వార్నింగ్‌ మెసేజ్‌ లో తెలిపారు.