
టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఫిట్నెస్ టెస్ట్‌లో పాసయ్యాడు. దీంతో సోమవారం భారతజట్టు బృందంతో కలిసాడు. దీంతో బిసిసిఐ శార్దూల్ ఠాకూర్‌ను విజరు హజారే ట్రోఫీ ముంబయి తరఫున ఆడేందుకు అనుమతిచ్చింది. 21న(ఆదివారం) మొతేరాలో జరిగిన ఫిట్నెస్ టెస్ట్‌కు ఉమేశ్ హాజరై ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో చివరి రెండు టెస్ట్‌లకు జట్టుకు అందుబాటులో ఉంటాడని బిసిసిఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్లో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా మెల్బోర్న్ మైదానంలో ఉమేశ్ గాయపడ్డ సంగతి తెలిసిందే.