Jan 15,2022 16:51

ప్రజాశక్తి-మంత్రాలయం : ఉన్నత విద్యతోనే చట్టాలపై అవగాహన వస్తుందని యస్ ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్టేషన్ లో కెవిపిఎస్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివితేనే చట్టాలపై అవగాహన వస్తుందని అప్పుడే కుల వివక్ష నేరంగా పరిగణిస్తారని పేర్కొన్నారు. డైరీ  అనేది చాలా ముఖ్యమైనది డైరీలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఆధునిక సమాజంలో దళితులు ఎన్నో అవమానాలకు అణచివేతకు గురి అవుతూ అంటరానివారిగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా దళితులపై దాడులు జరగడం బాధాకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ  మద్దిలేటి.మహిళా పోలీస్ గౌరీభీ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్. జయరాజు మండల కార్యదర్శి బి. అనిల్. కెవిపిఎస్ కార్యకర్తలు యం దావీదు.  రాజు. వై వీరేష్.తదితరులు పాల్గొన్నారు.