కాంగ్రెస్‌ నేతల ప్రచారం

Apr 1,2024 00:13
ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ఆదివాసులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్పర్సన్‌, అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ పి.శాంతకుమారి తెలిపారు. మండలంలోని కించుమండ పంచాయతీ కుసుమవలస గ్రామంలో ఆదివారం ఆమె సందర్శించి గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేనతో పాటు వైసిపితో గిరిజనులకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. త్వరలో జరగనున్న సారత్రిక ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటు హక్కుతో గిరిజనులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పి.చిన్నస్వామి, భీమారావు, పండన్న, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️