కార్యకర్తలను ప్రలోభాల పెట్టడం తగదు : బిటెక్‌ రవి

ప్రజాశక్తి – వేంపల్లె ఆక్రమంగా సంపాదించిన డబ్బులతో వైసిపి నాయకులు టిడిపి కార్యకర్తలకు ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారని టిడిపి పులివెందుల ఇన్‌ఛార్జి బిటెక్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మేదర వీధిలో ఉన్న 50 ముస్లిం కుటుంబాలు టిడిపి ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఇనాయతుల్లా ఆధ్వర్యంలో టిడిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు చెందిన మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వైసిపికి చెందిన స్థానిక నాయకుడు హరిజనవాడ, రాజీవ్‌ నగర్‌ కాలనీలోకి వెళ్లి టిడిపి కార్యకర్తలకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు డబ్బులు ఇచ్చి వైసిపిలోకి చేర్చుకున్నారని విమర్శించారు. జడ్‌పిటిసి వికుమార్‌ రెడ్డి చేష్టలు నచ్చకనే గతంలో నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌, జయచంద్రారెడ్డి, బాలకష్ణారెడ్డి లాంటి నాయకులు టిడిపి పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఉండేవారని కాపాడు కోవాలనే ఉద్దేశంతో డబ్బులుకు ప్రలోభాలు పెట్టుతున్నట్లు చెప్పారు. సతీష్‌ రెడ్డిని అభిమానించే వారు అందరూ టిడిపికి మద్దతు పలికాలని కోరారు. సతీష్‌ రెడ్డికి తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి, నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌, డివి సుబ్బారెడ్డి, జయచంద్రారెడ్డి, రామగంగిరెడ్డి, జగన్నాథరెడ్డి, మహమ్మద్‌, మడక శ్రీనివాసులు, తెలంగాణ వలి, వీర భైరవరెడ్డి, నాగ సుబ్బయ్య, వీరబద్ర, రామాంజనేయురెడ్డి, జన సేనా ఇన్‌ ఛార్జ్‌ డాక్టర్‌ హరీష్‌, ఫయాజ్‌, పీరా సాహెబ్‌, డక్కా రమేష్‌ తో పాటు పలువురు టిడిపి నాయకులు, జన సేనా నాయకులు పాల్గొన్నారు.

➡️