పాఠశాలను తీర్చిదిద్దిన సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు

Apr 1,2024 00:16
విద్యా పరికరాలను ఇస్తున్న సిఆర్‌పిఫ్‌ పోలీసులు

ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలోని నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామంలో పాఠశాల భవనం మరమతు పనులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌, సిఆర్పిఎఫ్‌ 198 బెటాలియన్‌కు చెందిన పోలీసులు చేపట్టారు. స్కూల్‌ను దత్తత తీసుకొని సొంత డబ్బులతో పాత భవనాన్ని మరమ్మతు చేపట్టి కొత్త భవనంగా తీర్చిదిద్దారు. స్కూల్లో విద్యార్థులకు కావలసిన పూర్తి పరికరాలను అందుబాటులోకి తీసుకు వచ్చి పూర్తిస్థాయిలో విద్యార్థులకు చదువుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. దీంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామస్తులందరూ పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్‌ ఐజి చారుశీల, 198 బెటాలియన్‌ కమాండర్‌ రాజేష్‌ పాండే, నర్మతి అవుట్‌ పోస్ట్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ బి.ఉదరు, సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ రమేష్‌, ఎస్సై శ్రీనివాస్‌, సిఆర్పిఎఫ్‌ జవాన్లు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️