వైసీపీ కంచుకోటను బద్దలు కొడదాం: ఎరిక్షన్‌బాబు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టి రానున్న ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగురవేద్దామని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. గురువారం యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనకు నూకలు చెల్లాయన్నారు. ప్రజలంతా ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం 2009లో ఏర్పాటు జరిగినా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. భూముల ఆక్రమణలు, అవినీతి, ఇసుక కుంభకోణాలు పెరిగి పోయాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. జనసేన, టిడిపి ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలో తెగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం పూరిస్తూ ఈ నెల 3వ తేదీన యర్రగొండపాలెం వస్తున్నట్లు చెప్పారు. భారీగా ప్రజలకు సమీకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఐదు మండలాల మండల కన్వీనర్లు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్‌, వలరాజు, ఏరువ మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసరెడ్డితో పాటు క్లస్టర్‌్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️