సమస్యలతో సతమతం

గెడ్డలో నీటిని మోసుకొస్తున్న గిరిజన మహిళలుగిరిజనం..

ప్రజాశక్తి -అనంతగిరి:అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన గ్రామాలు మగ్గుతున్నాయి. మౌలిక సదుపాయాలు అందని ద్రాక్షగా మిగి లాయి. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప అభివృద్ధికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.అనంతగిరి మండలం మారుమూల పినకోట పంచాయతీ పరిధి పందిరిమామిడివలసలో 20, కుటుబలు, కరిమామిడిలో 12 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు రోడ్డు, తాగునీటి, గృహాలు వంటి సౌకర్యాల అందక ఆయా గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస రోడ్డు సౌకర్యం లేక కొండకోనల నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరం కాలి నడకన గిరిజనులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అనారోగ్యం బారిన పడినప్పుడు రోగులు, గర్బిణిలపే డోలీ సహాయంతో వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక పోవడంతో నిత్యావసర సరుకులను భుజంపై మోసుకుంటూ దట్టమైన ఆటవీ ప్రాతం కొండ కోనల నడుచుకుంటూ గ్రామాలకు వెళ్తున్నారు. అటవీ ప్రాంతం గుండా రాకపోకలు చేస్తుండటంతో ఏ సమయంలో అటవీ జంతువులు దాడి చేస్తాయోనని భయంతో బిక్కుమంటూ గిరిజనులు రాక పోకలు సాగిస్తున్నారు. తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు కలుషితమైన ఊటగెడ్డ నీటిని ఆశ్రయిస్తున్నారు.

➡️