సిపిఎం నేతల ఆందోళన

ఏటిజి...రోడ్డు పను అవినీతి పై సమగ్ర విషరణ చేపట్టాలని ఆందోళన

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని గుమ్మ పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన నిమ్మఊట, కడరేవు, కర్రిగోడ గ్రామాల్లో చేపట్టిన రోడ్డు పనుల్లో అక్రమాలపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం ఉమ్మడి జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో కర్రిగొడ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు, అనంతరం సీపీఎం నేత గోవిందరావు మాట్లాడుతూ, కర్రిగూడకు 3 కిలోమీటర్లకు. గాను రూ.80. లక్షలు, కర్రిగూడ నుండి కడరేవు గ్రామానికి 0.80 కి.మీ. గాను రూ.22.0 లక్షలు గ్రావెల్‌ రోడ్‌ నిర్మాణ పనులకు మంజూరు అయ్యాయయన్నారు.మట్టి పరమెషన్‌ పనులు మాత్రమే చేసి గత సంవత్సరం మార్చి లో రెండు చోట్లా రోడ్డు పనుల్లో 65.5 లక్షలు బిల్లులు అప్లోడ్‌ చేసి జూన్‌ లో పేమెంట్‌ తీసుకొని స్వాహకు పాల్పడ్డారన్నారు. నేటికీ 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభం కాలేదన్నారు. నిమ్మ ఊట నుండి సుమారు 2 కిలోమీటర్లు మాత్రమే పనులు చేసి చేతులు దులుపుకొన్నారని తెలిపారు. దీనిపై గతంలో మండల పరిషత్‌ సమవేశం,. సోషల్‌ ఆడిట్‌ పబ్లిక్‌ ఫోరంలో ప్రస్థావనకు వచ్చినా ఇంజనీరింగ్‌ అధికారులు మోసపూరిత ప్రకటనలతో దాటవేశారని విమర్శించారు.సోషల్‌ ఆడిట్‌లో లక్షల్లో రికవరీకి ప్రతిపాదించినా నేటికీ చేయలేదన్నారు.దీనిపై సీపీఎం ఆద్వర్యంలో గిరిజనులు ఆందోళనకు సంబంధిత శాఖ అదికారులు మంగళవారం గ్రామంలో సందర్శించి తూతూమంత్రంగా విచారణ చేపట్టారన్నారు. ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి రోడ్డు పనులు పూర్తి చేపట్టే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎ.రాజారావు, బి.దేముడు, రామన్న పాల్గొన్నారు

➡️