ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌పై శిక్షణ

మాట్లాడుతున్న డిఇఒ బ్రహ్మాజీ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ (ఐఇ) అనేది అంగవైకల్యం ఉన్న పిల్లలకు విద్యను అందించడం, నేర్చుకోవడంలో ఇబ్బందులున్న పిల్లలకు ఎలా నేర్పించాలో ఐఇ విధానంతో సాధ్యమవుతుందని డిఇఒ బ్రహ్మాజీ అన్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు సుండ్రుపుట్టు ఎంపిపి పాఠశాలలో గురువారం ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌పై వన్డే ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరాన్ని బట్టి సహాయం అందించడం, పాఠశాల స్థాయిలో వికలాంగు పిల్లలను గుర్తించడం, విద్య అవసరాలను అంచనా వేయడం, విద్యాబుద్ధులు నేర్పడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలు ఎలా పొందాలి, ప్రభుత్వం నుండి పెట్టుబడి, విద్యార్థుల అలవెన్స్‌, సదరం సర్టిఫికెట్‌ పొందాలన్న దానిపై వివరించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఇ కో-ఆర్డినేటర్‌ కొమ్మ భాస్కరరావు, డిఇఒ కార్యాలయం, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️