ఎంసిసి నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-కడప ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు రానున్న సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజరురామరాజు ఎన్నికల నిర్వహణ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సభా భవనంలో సాధారణ ఎన్నికలు- 2024లకు సంబంధించి ఇఆర్‌ఒలు, డిఎస్‌పిలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, స్టాటిస్టిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్‌, వీడియో సర్వైలెన్స్‌ టీమ్స్‌, వీడియో వ్యూవింగ్‌ టీమ్స్‌ మొదలైన ఎన్నికల ప్రవర్తన నియమావళి సిబ్బంది, అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్‌ ట్రైనర్స్‌కు ఎంసిసి నోడల్‌ అధికారులు నందన్‌, సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రెండవ దశ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్ర మానికి కాలెక్టర్‌ హాజరై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరో కొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నాకున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి సంసిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రాధాన్యతతో, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకమై నదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పక పాటించాలన్నారు. అందులో ముఖ్యంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ పారదర్శక ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన 24 గంటలలోనే పార్టీలకు సంబంధించిన గుర్తులు, రాజకీయ పార్టీల నేపథ్యం ఉన్న పర్సన్స్‌కు సంబం ధించిన ఫోటోలను ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు, పబ్లిక్‌ ప్రదేశాలలో పూర్తిగా తొలగించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మ ద ష్టితో పరిశీలిస్తూ.. చిత్తశుద్ధితో, భాధ్యతాయుతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. మాస్టర్‌ ట్రైనర్లు పోలింగ్‌ అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా డిఎస్‌పిలు, పోలీస్‌ సిబ్బంది, ఎన్నికల విధులకు హాజరయ్యే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️