ఎన్నికల నియమావళి అతిక్రమణ

Mar 23,2024 21:52 #Case, #markapuram, #ycp mla

వైసిపి ఎమ్మెల్యే రాంబాబుపై కేసు

ప్రజాశక్తి – మార్కాపురం (ప్రకాశం జిల్లా) :ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం వైసిపి అభ్యర్థి అన్నా వెంకటరాంబాబుపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, 20వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ సలీంపైనా కేసు నమోదైంది. ఈ నెల 18న మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో షాదీఖానా స్లాబ్‌ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మార్కాపురం సబ్‌కలెక్టర్‌ రాహుల్‌ మీనా విచారణ చేపట్టారు. వాస్తవమని తేలడంతో మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.కిరణ్‌ ఫిర్యాదు మేరకు మార్కాపురం పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

➡️