ప్రజాశక్తి – రాయచోటి స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఈనెల 26న నిర్వ హించే 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కషి చేయా లన్నారు. వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు సమన్వ యంతో పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లన్నారు. ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండా లని చెప్పారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్ ను కూడా ఏర్పాటు చేయా లన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో షామియానా, కుర్చీలు, బారికేడింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆర్‌డిఒ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు సూచిం చారు. జాతీయ జెండా ఎగరవేయుట, వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు, సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీ, ప్రొటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు పంపిణీ తదితర అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్‌పి రాజకమల్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో పూర్తిగా సమన్వయం చేసుకొని పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి వేడుకల విజయవంతానికి కషి చేస్తామన్నారు. అధికారులందరూ ఒకరోజు ముందుగా పెరేడ్ మైదానాన్ని సందర్శించి చేయవలసిన ఏర్పాట్లపై తగు సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
