చేనేతల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

Nov 24,2023 23:07 #handlooms, #lagadapadu

పెదకూరపాడు : చేనేతల ఐక్యతతోనే అబివృద్ధి సాధ్యమని జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలూరి ఋషింగప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని లగడపాడు గ్రామంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంఘీ బావంగా ఉండి చేనేత కులాలు రాజకీయంగా ఎదిగినప్పుడే చేనేత కుటుంబాలు అభివృద్ధ్ధి చెందుతాయి అని వచ్చే ఎన్నికల లో చేతి వత్తుల పార్టీ తరుపున చేనేత బీసీ కులాలు, చేతి వృత్తుల వారందరూ పోటీ చేసి మన సత్తా చాటలనిఆయన కోరారు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం రామచంద్ర, ఎపి పద్మశాలి ఉద్యోగ సంఘం స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాముల హనుమంతరావు, పద్మశాలి సంఘము కస్తూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర పద్మశాలి యువ శక్తి ప్రతినిధులు మునగపాటి రమేష్‌ గోలి వంశీ కృష్ణ ,పెదకూరపాడు , సత్తెనపల్లి నియోజక వర్గాల చేనేతలు పాల్గొన్నారు. చేనేత ఐక్య వేదిక సంఘం నాయకులు మాట్లాడుతూ నేతన్నలు అందరూ సంఘీభావంగా ఉండి ప్రభుత్వము నుండి చేనేత కార్మికుల హక్కులు,రాయితీలు, ప్రోత్సాహకాల కోసం పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన పెదకూరపాడు జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం అధ్యక్షుడు చిల్లపల్లి సత్యం మాట్లాడుతూ సమష్టిగా పోరాడి సంక్షోభంలో ఉన్న చేనేతను కాపాడు కోవాలని అన్నారు. కార్యక్రమంలో పెదకూరపాడు, సత్తెనపల్లి నుండి చేనేత కార్మికులు హాజ రయ్యారు. అనంతరం జిల్లా, నియోజకవర, గ్రామ పట్టణ కమిటీల నూతన కార్యవర్గం నియామకం జరిగింది.

➡️