పడకేసిన పారిశుధ్యం

చర్చి సమీపాన ఉన్న చెత్తా చెదారం

ప్రజాశక్తి డుంబ్రిగుడ:- మండల కేంద్రంలోని ఎగువ వీధి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రోడ్డు చర్చి పక్కన చెత్తాచెదారంతో అపారిశుద్ధ్యం నెలకొంది. దీంతో, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఉపయోగించిన చెత్తచేదారంతో పాటు ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వస్తువులన్ని ఒకే చోట పడేయడంతో డంపింగ్‌ యార్డుల తలపిస్తుంది. రోడ్డు పక్కనే పడేయడంతో తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే స్థానిక గ్రామస్తులు, కళాశాల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దోమలు వ్యాప్తి చెందడంతో ఆ చుట్టుపక్కలనున్న నివాస గృహాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో అప్పుడప్పుడు పెద్ద వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దుర్వాసనతో పాటు దోమలు మరింత వద్ధి చెందే అవకాశం ఉందని దానివల్ల వ్యాధులు మరింత ప్రభలే అవకాశముంటుందని గిరిజనలు భయ పడుతున్నారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో పేరుకుపోయిన పారిశుద్ధ్యన్ని వెంటనే తొలగించి, భవిష్యత్తులో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️