విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం పట్ల విశ్రాంత ఉద్యోగులు శ్రద్ధ పెట్టాలని స్విమ్స్ ఆసుపత్రి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి .వనాజాక్షమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తిరుపతి నగర్ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఉదయం ఎల్.ఐ సి.రోడ్ లోని సంఘము భవనంలో ఘనంగా జరిగింది.తిరుపతి నగర శాఖ అధ్యక్షుడు కె.శంకర్ అధ్యక్షతన వహించారు. తిరుపతి సహాకార శాఖ అధికారి యస్. లక్ష్మి , స్విమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి వనజాక్షమ్మ, డివిజనల్ సబ్ ట్రెజరీ అధికారి ఇందిరాగౌరీ ,అమర ఆసుపత్రి నెఫ్రాలజీ డాక్టర్ శివపార్వతి, విద్యా వేత్త లోకేశ్వరిని, పలువురు విశ్రాంత మహిళా ఉద్యోగులను శాలువా ,మెమొంటో పుష్పగుచ్చాలతో సంఘం కార్య వర్గం ఘనంగా సన్మానించింది. అమర ఆసుపత్రి నెఫ్రాలజీ డాక్టర్ శివ పార్వతి కిడ్నీ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లు వివరించారు.విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్య దర్శి సి.వెంకటేశం శెట్టి, కోశాధికారి క్రిష్ణ మూర్తి, సంయుక్త కార్యదర్శి టి వి .రమణ పాల్గొన్నారు.
