ప్రజాశక్తి – కడప : నూతన ఎస్‌పిగా ఇటీవల బాధ్య తలు చేపట్టిన ఇ.జి. అశోక్‌ కుమార్‌ను మంగళ వారం ఆయన కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు అప్జల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో కడప అసెం బ్లీ నగర డివిజన్‌ ఇన్‌ఛా ర్జులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ద్వారా కడప ప్రజలకు మరింత మంచి సేవలు అందించాలని కాంగ్రెస్‌ నాయకులు ఆకాంక్షించారు. ఎస్‌పిని కలిసిన వారిలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు హమీద్‌, అబిద్‌ ఆసిఫ్‌ఖాన్‌, కమల్‌, జహూర్‌, దినకర్‌ రెడ్డి, జబ్బార్‌, అజహర్‌ ఉన్నారు.

➡️