ఏడి’పింఛన్‌’

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో పింఛన్‌దారులకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రప్రభు త్వం ఐదేళ్లుగా వాలంటీర్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధి కార, ప్రతిపక్ష పార్టీలు పెన్షనర్ల ఓట్లపై కన్నేసిన నేపథ్యం వృద్ధులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎన్నికల కమిషన్‌కు వాలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ చేయడంపై ఫిర్యాదుల ఫలితంగా సమస్య తలెత్తింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఉన్నఫళంగా తెరపైకి రావడం, ఇసి ఆదేశాల అమలులో దొర్లిన తొట్రుపాటు ఫలితంగా వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు.జిల్లాలోని 36 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 2,68,182 మంది పింఛనుదారులు ఉన్నారు. ప్రతినెలా రూ.28.61 కోట్ల పింఛన్‌ పంపిణీ చేయడం తెలిసిందే. ప్రభుత్వం ఐదేళ్ల నుంచి వాలంటీర్ల ద్వారా పకడ్బందీగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఉషోదయాన్నే పంపిణీ చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సామాజిక పింఛనుదారుల ఓట్లపై కన్నేయడం ప్రతిష్టంభనకు దారితీసింది. వాలంటీర్లు పింఛన్‌దారులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అనుమానాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఫిర్యాదు చేసిన ఫలితం పింఛనుదారులకు వేదన తప్పలేదు. ఎన్నికల కమిషన్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆదేశాల అమలుకు సమయం చాలకపోవడం, అమలులో రాజకీయం కల గలిసిన నేపథ్యం పింఛన్‌దారులు సచివాలయాల ఎదుట పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలోని 644 సచివాలయాలకు ఎస్‌బిఐ, ఎపిజిబి, ఐడిబిఎల్‌ వంటి బ్యాంకుల నుంచి నగదు చేరడంలో ఆలస్యం గందరగోళానికి దారి తీసింది. ఫలితంగా మం గళవారం మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుంచి 2,68,182 లబ్ధిదారులకు గానూ 1,09,685 మంది పింఛన్‌ దారులకు నగదు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయానికి 40 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రాత్రి 10 గంటల వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించను న్నట్లు తెలుస్తోంది. ఈలెక్కన 50 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. మిగిలిన వారి కి రెండు, మూడ్రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లాలోని వేంపల్లి, చాపాడు మండలాల్లోని పింఛన్‌దారులను ఆరా తీస్తే వాలంటీర్లను తప్పించడం వల్లే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రతిపక్ష టిడిపి తలపెట్టిన స్వార్థపూరిత నిర్వా కాల కారణంగానే ఇబ్బందులకు గురవుతున్నామని వాపోవడం గమనార్హం. వాలంటీరు లేకపోవడం వల్లే వాలంటీర్లు పింఛన్‌ సొమ్మును సకాలంలో అందించేవాళ్లు, వారికి నిలిపేయడంతో నాలుగు రోజులుగా పింఛన్‌ అందడం లేదు. మూడు, నాలుగు తేదీల్లో సచివాయాల్లో ఇస్తామన్నారు. వచ్చాం. ఉదయం నుంచి పడిగాపులు కాయడం తప్పలేదు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోతున్నాం.- మరియమ్మ, పింఛనుదారు, మైదుకూరు.ఉదయం వచ్చాను పింఛను కోసం గడ్డంవారిపల్లె నుండి సచివాలయానికి ఆటోలో వచ్చాను. సచివాలయ అధికారులు డబ్బులు ఇస్తాం అదిగో.. ఇదిగో వేచి ఉండు అంటున్నారు. కానీ ఎప్పుడిస్తారో చెప్పడంలేదు. మధ్యాహ్నం అయింది. భోజనం సమయం అయినా కూడా పింఛను ఇవ్వలేదు.- డి.కృష్ణమ్మ, వృద్ధురాలు, గడ్డంవారిపల్లి.షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నానునాకు షుగర్‌ వ్యాధి ఉంది. పెన్షన్‌ కోసం సచివాలయం వద్ద వేచి ఉన్నాను. అధికారులు పాత పద్ధతిలోనే పెన్షన్‌ ఇంటి వద్దనే ఇచ్చి ఉంటే బాగుండేది. సచివాలయం వద్ద పడిగాపులు కాయాలంటే కష్టంగా ఉంది.- ఎన్‌.పీరమ్మ, పింఛనుదారు, మైదుకూరు.సచివాలయాల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందిఈనెల పింఛన్‌ డబ్బుల కోసం సచివాలయాల వద్దకు రావాలని అధికారులు చెప్పారు. ఈ పింఛన్‌ సొమ్ము కోసం మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. గతంలో మాదిరి ఇంటి వద్దకే పింఛన్‌ అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.- వెంకటమ్మ, వితంతు, సింహాద్రిపురం.

➡️