ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యతలు

Dec 11,2023 12:48 #New Delhi

 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. సోమవారం ఉదయానికి కూడా గాలి నాణ్యతల్లో ఎలాంటి మెరుగుదల లేదని, అక్కడ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఆర్‌.కె. పురం ప్రాంతంలో ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి 346, ఆనంద్‌ విహార్‌లో 310 గాలి నాణ్యతలు (ఎక్యూఐ) నమోదయ్యాయని, తీవ్ర స్థాయిలోనే వాయు కాలుష్యం ఢిల్లీలో ఉందని సిపిసిబి వెల్లడించింది. ఇండియా గేట్‌ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కప్పి ఉంది.

➡️