పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ సిద్ధం

ఉండి రిటర్నింగ్‌ అధికారి సివి.ప్రవీణ్‌ ఆదిత్య

ప్రజాశక్తి – కాళ్ల

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశామని ఉండి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉండి నియోజకవర్గం వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థికి, ఏజెంట్‌కు ఒక్కో వాహనానికి అనుమతి ఉంటుందని, అను మతించిన వారు మాత్రమే వాటిని వినియోగించాలని, ఇతరులు వినియోగించరాదని తెలిపారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు మొబైల్‌ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.ప్రశ్న: ఉండి నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? ఆర్‌ఒ: ఉండి నియోజకవర్గంలో 238 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 2,24,725 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,10,146 మంది, మహిళలు 1,14,577 మంది, టాన్సజెండర్స్‌ ఇద్దరు ఉన్నారు.ప్రశ్న: హోమ్‌ ఓటింగ్‌కు నియోజకవర్గంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంతమంది వినియోగించుకున్నారు? ఆర్‌ఒ:హోమ్‌ ఓట్లు మొత్తం 151కుగాను 146 ఓట్లు పోలయ్యాయి. నలుగురు మృతి చెందగా మరొకరు ఐసియులో ఉన్నారు.ప్రశ్న: పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎంతమంది వినియోగించుకున్నారు? ఆర్‌ఒ: 1657 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఉండి నియోజకవర్గం నుంచి 1453 ఓట్లు, ఇతర జిల్లాల ఓట్లు 204 పోలయ్యాయి.ప్రశ్న: నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాలెన్ని ఉన్నాయి? ఆర్‌ఒ: నియోజకవర్గంలో మొత్తం 238 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 38 సమస్యాత్మక గ్రామాలున్నాయి.ప్రశ్న: పోలింగ్‌ స్టేషన్‌లో అందుబాటులో ఉంచుకునే సామగ్రి? ఆర్‌ఒ: పోలింగ్‌ స్టేషన్‌లో అందుబాటులో 20 రకాల వస్తువులు అవసరమవుతాయి.

➡️