మెడకు స్కార్ఫ్‌ చుట్టి అంగన్వాడీ టీచర్‌ హత్య

May 15,2024 11:49 #crime
upadhi worker died

తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఏటూరునాగారం బయలుదేరారు. బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అడవికి వెళ్లిన తునికాకు కూలీలకు సుజాత మఅతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ శంకర్‌, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మఅతురాలి మెడకు స్కార్ఫ్‌ను చుట్టి ఉరి వేసినట్లు గుర్తించారు. సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.

➡️