పాడేరు : 1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ ఈనెల 11,12 తేదీల్లో చేపట్టే మన్యం బంద్‌కు సహకారం అందించాలని ఆదివాసి అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర మన్యం బంద్‌ను భగం చేసేందుకు ఎన్నికల కమిషన్‌ను అడ్డుగా పెట్టుకొని పోలీస్ లతో నోటీస్‌లు ఇస్తున్నారని తెలిపారు. పోలీసులతో మాట్లాడి శాంతియుతంగా మన్యం బంద్ విజయవంతం చేసుకోవాలని, పోలీస్ లకు సహకారం అందించాలని కలెక్టర్ సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం, అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు పి.అప్పలనరస, సమార్డి మాణిక్యం, రాధాకృష్ణ, రాజబాబు, వంతాల నాగేశ్వరావు, కొండపల్లి కాంతారావు, పి.జీవన్ కృష్ణ, సుబ్రమణ్యం, ఎల్.సుందర్రావు పాల్గొన్నారు.
