పట్టుపడ్డ ఒడిశా వాసులు

పట్టుబడ్డ వారిని ప్రశ్నిస్తున్న అటవీశాఖ అధికారులు

ప్రజాశక్తి-చింతపల్లి: అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒడిశా వాసులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం అటవీశాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం… ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం ”హితుగూడెం గ్రామానికి చెందిన 13మంది వ్యక్తులు 7 ద్విచక్ర వాహనాలపై, 14 గోనె మూటల్లో ‘అడవి దున్న ‘ఎండిన మాంసాన్ని తరలిస్తున్నారన్నారు. జీకే వీధి పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు జీకే వీధి రోడ్డు వద్ద ఏడు ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వారి వద్ద ఉన్న మూటలలో ఎండిన మాంసం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియ పరిచారు. అర్వినగర్‌ డివిజనల్‌ అటవీ శాఖ అధికారి ఆ మాంసం అడవి జంతువుదని నిర్ధారించి13 మందిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వారి వద్దనున్న 7 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసి, 150 కిలోల ఎండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. 13మంది నిందితులఫై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

➡️