వర్థంతి కార్యక్రమాల్లో ప్రముఖులు
భగత్‌సింగ్ ఆశయాలు అనుసరణీయమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే భగత్‌సింగ్‌కు నిజమైన నివాళి అని పలువురు అన్నారు. ఆదివారం భగత్‌సింగ్ వర్థంతి కార్యక్రమాలను జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ప్రజాశక్తి – నూజివీడు టౌన్
పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జి.రాజు, ఎంఆర్.హనుమాన్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మాంజలి, కేశవరావు, వసంతరావు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.ఏలూరు అర్బన్ : దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఆదివారం స్థానిక సుందరయ్య కాలనీలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల చిత్రపటాలకు డివైఎఫ్‌ఐ మాజీ నాయకులు పి.ఆదిశేషు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వైఎస్.కనకారావు, వివిఎన్.ప్రసాద్, జె.గోపీ, బి.సోమయ్య, చల్ల పైడియ్య, ఆర్.నరసింహమూర్తి, సత్తిరాజు, నాగమణి, అపాయమ్మ, సత్యనారాయణ, ప్రశాంత్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం :పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్‌లో స్వతంత్ర పోరాట యోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపీ అధ్యక్షత అధ్యక్షత వహించగా డివైఎఫ్‌ఐ జిల్లా పూర్వ నాయకులు పసల సూర్యరావు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మాజీ నాయకులు ఎం.జీవరత్నం, వంగ గోపీ, పిల్లి పోతురాజు, వెంకట సుబ్బారావు, వీర్రాజు, కె.సుబ్బారావు, బి.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. ముసునూరు : ముసునూరు గుడిసెల సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొడవలి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పేరిచర్ల వెంకన్న,పేరిచర్ల మంగమ్మ, పేరిచర్ల శివకుమారి, జూటురు జమలయ్య, జూటురు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.టి.నరసాపురం : మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు అనుమోలు మురళి పలువురు నాయకులతో కలిసి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బరగడ కుమారి, శిరీష, మంగ బూదెమ్మ పాల్గొన్నారు.నిడమర్రు : మండలంలోని భువనపల్లి, అడవికొలను గ్రామాల్లో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోన శ్రీనివాసరావు, గవర సత్యనారాయణ, వెలగలేటి మోహనం, లావేటి సోంబాబు, కమిలి నాని, పిల్లా బ్రహ్మం, గుండమ్మ రాము, కురిటి అప్పారావు, సింగంపల్లి సత్యనారాయణ, కలిసేట్టి నరసింహారావు, గొలగన అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి : డివైఎఫ్‌ఐ యువజన సంఘం పూర్వ జిల్లా అధ్యక్షులు ఎ.రవి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వంకవారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ప్రధానాచార్యులు జనార్ధన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన విద్యార్థి భగత్ సింగ్ చిత్రపటాన్ని బ్లాక్ బోర్డుపై గీసిన విధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు తెల్లం దుర్గారావు, వెంకట్రావు, సీతారామయ్య, ఆర్.దానియేలు, కె.దుర్గ, జనార్ధన్, గంగులు తదితరులు పాల్గొన్నారు. భీమడోలు : భీమడోలులోని బాలుర ప్రత్యేక వసతి గృహంలో నిర్వాహకులు గురుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు హాజరయ్యారు. వసతి గృహ నిర్వాహకులతో పాటు లింగరాజు, భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ జీవిత విశేషాలు ఇతర అంశాల గురించి విద్యార్థులకు లింగరాజు వివరించారు. ఆగిరిపల్లి : భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్థంతి సందర్భంగా ఆగిరిపల్లి సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి షేక్ జహాంగీర్ భాషా, వ్యవసాయ కార్మికసంఘం మండల కార్యదర్శి సత్తు కోటేశ్వరరావు, సభ్యులు నైనవరపు ఊళక్కయ్య, షేక్ ఛాన్‌భాషా, సంగా శ్రీనివాసరావు, చింతకాయల రాంబాబు పాల్గొన్నారు.
